సిరాన్యూస్ , ఖానాపూర్
మహేష్‌కుమార్‌గౌడ్‌ను సన్మానించిన కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బాణావత్ గోవింద్ నాయక్
టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా బీ. మహేష్ కుమార్ గౌడ్ నియామకం పట్ల కాంగ్రెస్ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు బాణావత్ గోవింద్ నాయక్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో బీ. మహేష్ కుమార్ గౌడ్‌ను బాణావత్ గోవింద్ నాయక్ కలిసి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. అనంతరం మహేష్‌కుమార్‌గౌడ్‌కు శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు భవాని ,ఎన్ఎస్ యుఐ, జిల్లా అధ్యక్షులు రాకేష్ సేవాదళ్ రాజేశ్వర్. కాంగ్రెస్ పార్టీ, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.