
మిషన్ 80 గా కాంగ్రెస్ అడుగులు…
మరో 9 మంది కోసం గేట్లు ఓపెన్ సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణ కాంగ్రెస్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. 80 టార్గెట్ గా పెట్టుకుని వీలైనంత త్వరగా టార్గెట్ ఫినిష్ చేయాలని హస్తం నేతలు కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య కనీసం 80కి చేరాలని డిసైడ్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందగా, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యా బలం 65 కి పెరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు విడతల వారీగా కాంగ్రెస్ గూటికి చేరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే…
