
అవినీతి అధికారులకు మళ్లీ అందలం
సిరా న్యూస్,విశాఖపట్టణం; గత వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన మండలాలకు తహసీల్డార్‌లుగా పని చేసి వందలు, వేల కోట్ల కుంభకోణాల ఆరోపణలు, వివాదాలు ఎదుర్కొన్న తహసీల్దార్‌లనే కూటమి ఎమ్మెల్యేలు ఏరి కోరి ఎంచుకొన్నారు. నిజాయితీపరుల కంటే అవినీతిపరులు, పైరవీకారులకే పెద్ద పీట వేశారు. ఎన్నికల సమయంలో పక్క జిల్లాలకు వెళ్లిన తహసీల్దార్‌లు తిరిగి రావడంతో జిల్లా కలెక్టర్ హరీందర ప్రసాద్ శనివారం వారికి నియామక ఉత్తర్వులు అందజేశారు. వీటిని చూసిన జనం, కూటమి కార్యకర్తలు ముక్కున వేలేసుకొంటున్నారు.విశాఖలో అత్యంత కీలకమైన వేల కోట్ల ప్రభుత్వ భూములు వున్న ఆనందపురం తహసీల్దార్ పోస్టు.. రెవిన్యూ విభాగంలో అత్యంత వివాదాస్పదుడిగా పేర్కొని, వందల కోట్ల భూకుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న పి.శ్యాం ప్రసాద్‌కు దక్కింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పెందుర్తిలో హైకోర్టు సైతం తప్పుపట్టిన ముదపాక ల్యాండ్ పూలింగ్ భూములతో పాటు అప్పటి…
