తాజా వార్తలు

Councilor Shabbir Pasha: మ‌హాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ పత్రాలు అందజేత : కౌన్సిలర్ షబ్బీర్ పాషా

సిరాన్యూస్‌, ఖానాపూర్ టౌన్‌ మ‌హాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ పత్రాలు అందజేత : కౌన్సిలర్ షబ్బీర్ పాషా నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో 12వ వార్డు కౌన్సిలర్ షబ్బీర్ పాషా లక్ష్మి మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్న గ్యాస్ సబ్సిడీ పత్రాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ షబ్బీర్ పాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి గ్యాస్ సబ్సిడీ అందజేస్తున్నందున ప‌ట్ట‌ణంలో సబ్సిడీ పత్రాలను అందజేయడం జరిగిందని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడం జరుగుతుంద‌ని తెలిపారు. కార్యక్రమంలో డీలర్ కిషన్ , ఆర్పి మెప్మా నారాయణ ,12వ వార్డు కాలనీవాసులు మహిళలు పాల్గొన్నారు.

Read More
23 Sep 2024, 12:07 pmsiranews.in