Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 8 October 2024, 7:52 pmEditor : SIRA NEWS
Councilor Shabbir Pasha: ఆరోగ్యంపై శ్రద్ద పెట్టాలి : కౌన్సిలర్ షబ్బీర్ పాషా

సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
ఆరోగ్యంపై శ్రద్ద పెట్టాలి : కౌన్సిలర్ షబ్బీర్ పాషా
* 12వ వార్డు సుభాష్ నగర్ లో వైద్య శిబిరం
ప్రతిఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వార్డు కౌన్సిలర్ షబ్బీర్ పాషా అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటి పరిధిలోని సుభాష్ నగర్ కాలనీలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా 30 సంవత్సరాలు పై బడిన వారందరికీ బీపీ, షుగర్ లు టెస్టు చేసి రోగులకు మందులు అందజేశారు. ఈ సందర్బంగా వార్డు కౌన్సిలర్ షబ్బీర్ పాషా మాట్లాడుతూ ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మైనార్టీ అధ్యక్షులు సలీం ఖాన్,వైద్య సిబ్బంది నారాయణ,రాజు,మీరా బాయి,పద్మ,ఏ ఎన్ ఎం, పుష్ప అంగన్వాడీ టీచర్ లు సరోజ మమత,మెప్మా నారాయణ,తదితరులు పాల్గొన్నారు.
