Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 21 September 2024, 6:23 pmEditor : SIRA NEWS

Councilor Shabbir Pasha: పిల్లలకు పోషక ఆహారమే అందించాలి:  కౌన్సిలర్ షబ్బీర్ పాషా

సిరా న్యూస్‌,ఖానాపూర్ టౌన్
పిల్లలకు పోషక ఆహారమే అందించాలి:  కౌన్సిలర్ షబ్బీర్ పాషా
* సుభాష్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ మసోత్సవాలు

పిల్లలకు పోషక ఆహారమే అందించాలని కౌన్సిలర్ షబ్బీర్ పాషా అన్నారు.నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని 12వ వార్డు సుభాష్ నగర్ అంగన్వాడి కేంద్రంలో సమగ్ర శిశు అభివృద్ధి సేవ పథకం ద్వారా శనివారం పోషణ మసోత్సవాలు నిర్వ‌హించారు. ఈకార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కౌన్సిలర్ షబ్బీర్ పాషా హాజ‌రై మాట్లాడారు. పసి పిల్లలకు సరైన పోషకాలతో కూడిన ఆహారం అందిస్తేనే సరైన ఎదుగుదల ఉంటుందని తెలిపారు. ఏ ఆహారంలో ఎలాంటి పోషకాలు ఉంటాయో తెలియ‌జేశారు. తల్లులు, పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం పై సూపర్ వైజర్ శ్యామల అవగాహన కల్పించారు. అనంత‌రం పోషకాహారం బలామృతం పిల్లలకు అందించారు. కార్యక్రమంలో సూప‌ర్‌వైజ‌ర్‌ శ్యామల, అంగన్వాడీ టీచర్లు సరోజ, మమత,ఏ ఏన్ ఎం పద్మ, మహిళలు పిల్లలు పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.