
కేంద్ర బడ్జెట్ కు నిరసనగా సిపిఎం అందోళన
సిరా న్యూస్,కాకినాడ; సామాన్యుల పై భారాలు వేస్తూ, దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టే విధంగా రూపొందించిన కేంద్ర బడ్జెట్ 2024కు నిరసనగా సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు. కాకినాడ లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద మంగళవారం సిపిఎం నగర కమిటి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరు పై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్, జిల్లా నాయకులు దువ్వ శేషబాబ్జీ, జి. బేడిరాణి, నగర సీనియర్ నాయకులు కె. సత్తిరాజు, ట్రేడ్ యూనియన్ నేత సిహెచ్. రాజ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కాకులను కొట్టి గద్దలకు వేసే చందంగా ఉందని విమర్శించారు. అదేవిధంగా ఒకప్రక్క ఆంధ్రప్రదేశ్ ఎంపీల సహాయంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ…
