తాజా వార్తలు

భారీగా అనుమానాస్పద లావాదేవీలు..  70 లక్షల మొబైల్‌ నంబర్లు బ్లాక్‌..

సిరా న్యూస్,ముంబై; దేశంలో డిజిటల్‌ లావాదేవీలు భారీగా కొనసాగుతున్నాయి. డిజిటల్‌ మోసాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా బ్యాంకుల ప్రతినిధులతో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెక్రటరీ వివేక్‌ జోషీ సమావేశం నిర్వహించారు. ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ, టెలికాం, ఐటీ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియాతోపాటు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిజిటల్‌ మోసాలు, వాటిని ఎదుర్కోవడంలో తలెత్తుతోన్న సవాళ్లకు సంబంధించి ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చింది.డిజిటల్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు బ్యాంకులు తమ వ్యవస్థలను పటిష్ఠపరచుకోవాలని వివేక్‌ జోషీ సూచించారు. ఆధార్‌ ఆధారిత పేమెంట్లలో మోసాలు, సమాచార భద్రతపై దృష్టి సారించాలని రాష్ట్రాలను అలర్ట్ చేశారు. వ్యాపారుల కేవైసీ ప్రామాణీకరణంపైనా ఈ సమావేశంలో చర్చించామన్నారు. మరోవైపు…

Read More
1 Dec 2023, 7:36 pmsiranews.in