
ఇక దబిడి…దబిడే
సిరా న్యూస్,హైదరాబాద్; కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా..పెద్ద ఎత్తున నిరసనకు రెడీ అవుతోంది. ఇచ్చిన హామీలేంటి.? అమలు చేసిందేంటి.? అంటూ అధికార కాంగ్రెస్‌ను నిలదీసేందుకు..భారీ కార్యక్రమానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.అపోజిషన్ రోల్‌లో తగ్గడం లేదు బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పడు ఎక్స్‌పోజ్ చేస్తూనే ఉంది. అయితే వన్ ఇయర్ టైమ్ ఇవ్వాలనే ఆలోచనతో ఎక్కువగా దూకుడు ప్రదర్శించడం లేదు బీఆర్ఎస్ నేతలు. ఇప్పుటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 11 నెలలు అయిపోతుంది. వచ్చే నెల 7వ తేదీ నాటికి ఏడాది పూర్తి చేసుకుంటుంది. అప్పటినుంచి దద్దరిల్లిపోవాల్సిందేనంటోంది బీఆర్ఎస్. అధికార పార్టీ వైఫల్యాలపై మరింత బలంగా పోరాడాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఆందోళనలు, సభలు, సమావేశాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్లాన్ చేస్తోంది.ఆరు గ్యారెంటీలు.. 420 హామీల కథేంటని ఇప్పటికే..అధికార పార్టీని కార్నర్ చేస్తోంది…
