Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 3 May 2024, 4:09 pmEditor : Sira News

మామ కోసం కోడలు ప్రచారం

సిరా న్యూస్,ఖమ్మం;
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ నడుస్తోంది. ఓవైపు భానుడి భగభగలు రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కానీ ఈసారి ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీలు మండే ఎండలను లెక్కచేయకుండా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. పోటీలో నిలబడిన నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న పద్దతులను అనుసరిస్తున్నారు. ఓటర్ల మనసులు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రోడ్ షోస్, బహిరంగ సభలు నిర్వహిస్తూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.ఖమ్మం లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి కోసం ఆశ్రిత ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఖమ్మం లోక్ సభ స్థానం మీద ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఈ స్థానంపై తీవ్రస్థాయిలో పోటీ ఉంది. ఓవైపు బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీజీపీ నుంచి తాండ్ర వినోద్ రావు పోటీ చేస్తున్నారు. అలాగే ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. హీరో విక్టరీ వెంకటేశ్ ల వియ్యంకుడు రామసహాయం రఘురామ రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. అయితే రాఘురామరెడ్డి కోసం వెంకటేశ్ ప్రచారం చేస్తున్నారని టాక్ వినిపించింది. కానీ వెంకీకి బదులుగా ఆయన పెద్ద కూతురు ఆశ్రిత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నేడు ఖమ్మంలో నిర్వహించిన మీటింగ్‏లో ఆశ్రిత పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని సమావేశానికి హజరైన ఆశ్రిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి అందురు ఓటు వేసి రఘురామరెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రస్తుతం ఆశ్రిత ఎన్నికల ప్రచార వీడియో నెట్టింట వైరలవుతుంది. అయితే ఎన్నికల ప్రచారం వెంకటేశ్ పాల్గొంటారా ? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.