
డీల్ సెట్… బెంగళూరు అన్నకు.. హైదరాబాద్ చెల్లెలకి
సిరా న్యూస్,హైదరాబాద్; వైసీపీ అధినేత జగన్ వర్సెస్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య రాజకీయ దుమారం ఓ రేంజ్‌లో సాగుతు న్న విషయం తెలిసిందే. ఇది ఇటీవల ఎన్నికల్లో జగన్ ఓటమి వరకు దారి తీసింది. తీవ్రస్థాయిలో షర్మిల జగన్‌పై యాంటీ ప్రచారం చేశారు. ఇక, ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా.. రాష్ట్రంలో ఏం జరిగినా దాని ని జగన్ పాలనకు అంటగట్టి విమర్శలు గుప్పించారు. అయితే.. ఈ విమర్శలకు, టార్గెట్‌కు కారణం.. వారసత్వపు ఆస్తుల పంపకాల్లో వచ్చిన తేడాలే కారణమన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ.ఈ విషయంలో జగన్, షర్మిలల మాతృమూర్తి కూడా.. ఏమీ చేయలేక పోయారన్న వాదన ఉంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ ను తమకు ఇచ్చేయాలన్నది షర్మిల డిమాండ్ చేస్తున్నారని ఏడాది కాలంగా చర్చనడుస్తోంది. ఈ విషయంలో జగన్ పంతానికి…
