
డియర్ సీఎంగారు… ఇప్పుడు ఉద్యోగామా….
హార్ట్ టచింగ్ లెటర్ రాసిన నళిని సిరా న్యూస్,హైదరాబాద్; దోమకొండ నళిని… ఈ పేరు కొంత మందికే తెలుసు.. కానీ డీఎస్పీ నళిని అంటే మాత్రం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మూడు కోట్ల తెలంగాణ ప్రజలకు సుపరిచితం. స్వరాష్ట్రం కోసం ఉద్యోగాన్ని గడ్డిపోచలా వదిలేసిన ఉద్యమకారిణి. తెలంగాణ ఉద్యమ సమయంలో తనవారిపై లాఠీ ఝళిపించలేదె.. మా రాష్ట్రం మాకు కావాలని ఉద్యమిస్తున్న యువకుల గుండెలపై తుపాకీ గురిపెట్టలేక.. ఇటు అధికారుల ఒత్తిడి తట్టుకోలేక.. కష్టపడి సాధించిన కొలువును తీసి అవల పడేసింది. తెలంగాణ ఉద్యమ పార్టీగా స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత టీఆర్ఎస్(ఇప్పుడు బీఆర్ఎస్)కు 2014లో ప్రజలు పట్టం కట్టారు. ఉద్యమకారును ఆదుకుంటామని చెప్పిన నాటి సీఎం కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఉద్యమకారులకు న్యాయం చేయలేకపోయారు. పోలీస్ కిష్టయ్య బిడ్డను డాక్టర్ చదివించామని గొప్పలు చెప్పుకుంటున్న…
