
గొడవలతో పరువు పాయో
సిరా న్యూస్,విజయవాడ; ఇప్పటివరకు జాతీయ స్థాయిలో ఏపీకి మంచి పేరు ఉంది. సౌమ్యమైన రాష్ట్రంగా గుర్తింపు ఉంది. కానీ గత ఐదు సంవత్సరాలుగా జరిగిన పరిణామాలు అపఖ్యాతిని మూటగట్టుకునేలా ఉన్నాయి. ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత జరిగిన ఘటనలతో.. ఏపీ ఉత్తరాది రాష్ట్రాల జాబితాలో చేరిపోయింది. పాపం కరోనా సమయంలో మాస్కులు అడిగిన పాపానికి ఓ డాక్టర్ను ఎలా శిక్షించారో అందరికీ తెలిసిన విషయమే. తన అక్కను వేధిస్తున్నారని అడిగిన పాపానికి పదో తరగతి చదువుతున్న బాలుడిని యాసిడ్ చంపారు. తన కారు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారు ఓ ప్రజా ప్రతినిధి. విపక్షాలు ఆరోపించినట్టు కాదు కానీ.. చాలా రకాల సాక్షాలు సామాన్య జనాలకు సైతం కనిపిస్తున్నాయి. అందుకే జగన్ సర్కార్ ఇంత ప్రజావ్యతిరేకత మూటగట్టుకుంది. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసినా..…
