
ధరణి… మారని ధోరణి
సిరా న్యూస్,నిజామాబాద్; బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి అక్రమాల పుట్టగా తయారయింది. అందుకే కాంగ్రెస్ సర్కార్ ధరణి ప్రక్షాళన చేపట్టింది. అందులో భాగంగానే స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. అయితే భూ సమస్యలు పరిష్కరించేందుకు పారదర్శకంగా ధరణి పోర్టల్‌ను తీర్చిదిద్దినా ..వివిధ దశల్లో దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరగుతోంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే దాదాపు 61,019 దరఖాస్లులు పెండింగ్ లో ఉన్నాయి. వరుస ఎన్నికలకు తోడు రెవెన్యూ అధికారుల బదిలీ, కొత్తగా వచ్చిన అధికారులు వీటి పరిష్కారానికి అంతగా ఆసక్తి చూపక పోవడంతో దరఖాస్తుల సంఖ్య పేరుకుపోయింది. కలెక్టర్లు లేదా ఇతర రెవెన్యూ అధికారులు మారితే చాలు.. ఫైల్స్ అన్నీ తిరిగి వెనక్కి పంపించేస్తున్నారు మరోపక్క ధరణి సమస్యలను పరిష్కరించాలని సమీక్షలు నిర్వహిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది.వ్యవసాయ భూముల రక్షణకు తీసుకువచ్చిన ధరణి చట్టం రైతుల…
