
ధరణిని ప్రక్షాళన చేస్తాం మంత్రి పొంగులేటి
సిరా న్యూస్,ఖమ్మం; జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పులను లోపాలను బయట పెడతాం. ఆనాటి ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్చారు అనేది అధికారుల నుండి అడిగి తెలుసుకున్నాను. ఈ 6 పథకాలు ఇంటింటికి చేరుతాయని నమ్మి ఇందిరమ్మ రాజ్యం కోసం కాంగ్రెస్ ను గెలిపించారు. గత ప్రభుత్వం లో చెందిన తప్పులకు ఏ అధికారులు ఎవరు బాధ్యులో తెలుసుకుంటాం. దానికి బాధ్యులైన అధికారులు మీద తీసుకునే చర్యలు తప్పవు. స్వేచ్ఛగా ఉండే ఫ్రెండ్లీ ప్రభుత్వం ఇది. చిత్త శుద్ధితో పనిచేసే అధికారులను కీ పోజిషన్ లో ఉంచుతామని అన్నారు. గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు అధికారుల మీద రుద్దారు. కక్ష్య సాధింపు చర్యలు ఏ అధికారుల మీద ఉండవు.…
