
మేడారంలో డయేరియా
సిరాన్యూస్,వరంగల్; మేడారం జనజాతరను తలపిస్తోంది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో కోలాహలంగా మారింది. కుంభమేళాను తలపించే రీతిలో లక్షలాది జనం పోటెత్తారు. మేడారం వెళ్లేదారులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇంతపెద్దఎత్తున జనం ఒకచోట గుమిగూడటంతో పాటు జంపన్న వాగులో సామూహిక స్నానాలు ఆచరిస్తుండంతో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.అలాగే జనం ఒత్తిడికి భక్తులు సొమ్మసిల్లిపడిపోతున్నారు. అలాంటి వారి కోసం మేడారంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు.కుంభమేళాను తలపించే మేడారంలో భక్తులు సదుపాయాలు అందించడం ఎంతో కీలకం. అత్యవసర ప్రాథమిక చికిత్స సత్వరం అందించకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం పెద్దఎత్తున వైద్య శిబిరాల ఏర్పాటు చేసింది.మేడారంలోని టీటీడీ కల్యాణమండంపలో 50 పడకల ఆస్పత్రిని సిద్ధం చేసింది. అయితే జాతరకు వచ్చే భక్తుల్లో ఎక్కువ మంది అశుభ్రమైన తినుబండారాలు, నీరు తాగి డయేరియాకు…
