
సజ్జలను సైడ్ చేసేశారా…
సిరా న్యూస్,విజయవాడ; వైసీపీలో నాయకుల వాదన అంతా అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూనే తిరుగుతోంది. ఆయన వల్లే పార్టీకి కష్టాలు ఏర్పడ్డాయని.. ఆయన నిర్ణయాలే పార్టీని ముంచేశాయని చాలా మంది నాయకులు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు.. ప్రభుత్వంలోనూ సజ్జల కీ రోల్ పోషించారు. అంతా ఆయన కనుసన్నల్లోనే వ్యవహారాలు సాగాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. ఇలా ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా.. సజ్జల సర్ చెప్పాల్సిందే.అంతేకాదు.. నియోజకవర్గాల్లో విభేదాలు, వివాదులు చోటు చేసుకున్నప్పుడు కూడా.. పంచాయతీలు చేసింది సజ్జలే. అయితే.. అప్పట్లో అంటే.. ఆయన మాటకు కట్టుబడో.. లేక భయపడో నాయకులు వ్యవ హరించారు. కానీ, పార్టీలో ఓటమికి కూడా ఆయనే కారణమన్న భావన ఉంది. ముఖ్యంగా పార్టీలో నాయకు లను మార్పు చేసిన విషయం తెలిసిందే. సుమారు 85 నియోజకవర్గాల్లో నాయకులను మార్పు…
