కువైట్ లో కడప మహిళకు కష్టాలు

సిరా న్యూస్,కడప;
తినేందుకు తిండి లేక, తలదాచుకునేందుకు ఆశ్రమం లేక తాను తన ఇద్దరు పసి పిల్లలు కలిసి కువైట్ లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తమను కువైట్ నుండి ఇండియాకు రప్పించి కాపాడాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లను వేడుకుంటూ అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ మహిళ సెల్ఫీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని రాజుల కాలనీ కి చెందిన షేక్ బీబీ (38) అనే మహిళ బతుకు తెరువు కోసం ఐదేళ్ల క్రితం గల్ఫ్ దేశమైన కువైట్ కు వెళ్ళింది. అక్కడ ఓ షేట్ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు ఆ ఇంట్లో పని ఒత్తిడి ఎక్కువ కావడంతో ఇంట్లో నుండి పరారీ అయి బయట తలదాచుకుంది. అక్కడ కడప జిల్లా మైదుకూరు కు చెందిన దస్తగిరి భాషా తో పరిచయం ఏర్పరచుకుంది. వీరి పరిచయం ప్రేమగా మారింది. ఇరువురు కువైట్ లోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని బయట పనులు చేసుకుంటూ అక్కడే సహజీవనం సాగిస్తూ వచ్చారు. వీరిద్దరికీ ఇద్దరు ఆడబిడ్డలు సంతానం కలిగారు. ఈ క్రమంలో ఓ రోజు పోలీసుల తనిఖీల్లో భాగంగా దస్తగిరి భాష మద్యం సేవించి పోలీసులకు పట్టుబడడంతో అతనికి పోలీసులు ఫింగర్ వేసి ఇండియాకు పంపి వేశారు. అప్పటి నుండి షేక్ బీబీ తన ఇద్దరు పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తినేందుకు తిండి లేక, చేతిలో డబ్బులు లేక, తలదాచుకునేందుకు ఆశ్రమం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండియాకు వచ్చేందుకు షేక్ బీబీ కి అకామ లేకపోవడంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి కువైట్ లో మరింత తీవ్ర ఇబ్బందులు పడుతుంది. తనను, తన పిల్లలను ఎలాగైనా కువైట్ నుండి ఇండియాకు రప్పించాలంటూ బాధిత మహిళ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, రాంప్రసాద్ రెడ్డి లను వేడుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *