
జన్వాడ ఫాం హౌస్ చుట్టూ చర్చ
సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణలో చాలామంది లీడర్లకు ఫాంహౌస్‌లు ఉన్నాయి. కానీ, జన్వాడ ఫాంహౌస్ వెరీ వెరీ స్పెషల్. 111 జీవో పరిధిలో అక్రమంగా దీన్ని నిర్మించారనే ఆరోపణలున్నాయి. హైడ్రా ఈ ఫాంహౌస్‌పై దృష్టి సారించిన నేపథ్యంలో, ఓనర్‌గా చెప్పుకుంటున్న ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ఫాంహౌస్‌పై మరోసారి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.నగరంలో కబ్జాలపై దృష్టి పెట్టిన హైడ్రా, 111 జీవో పరిధిలోని అక్రమ కట్టడాలపై ఫోకస్ పెట్టింది. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలపై కొరడా ఝులిపిస్తోంది. ఈ క్రమంలో జన్వాడ ఫౌంహౌస్ కూల్చోద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రదీప్ రెడ్డి ఈ పిటిషన్ వేశాడు. జన్వాడ ఫౌంహౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉండడంతో తమ కట్టడాన్ని హైడ్రా కూల్చే అవకాశం ఉందని ముందస్తు పిటిషన్ దాఖలు చేశాడు. కూల్చకుండా స్టే ఇవ్వాలని కోరాడు. ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం,…
