
రెస్ట్ మోడ్ లోకి డీఎల్
సిరా న్యూస్,కడప; ఎన్నికల నామినేషన్ల ముందు వరకూ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి యాక్టివ్ గా కనిపించారు. అధికార వైసీపీని ఓడించాల్సిందేనంటూ ఆయన మీడియా సమావేశాలు పెట్టి మరీ పిలుపు నిచ్చారు. జగన్ ను ఓడించి తీరుతానని శపథం చేశారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మాత్రం ఆయన సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. డీఎల్ ను ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలూ పట్టించుకోలేదు. అసలు ఆయనంటూ ఒకరున్నారా? అన్న అనుమానం కూడా కలుగుతుంది. డీఎల్ లో రాజకీయంగా ప్రభావం చూపేంత శక్తి తగ్గిందా? లేక ఆయనను పార్టీలోకి తెచ్చుకుని లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకని భావిస్తున్నారా? అన్నది మాత్రం అర్థం కాకుండా ఉంది.డీఎల్ రవీంద్రారెడ్డి గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అయితే ఆయనకు ఎలాంటి పదవి లభించలేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో సీటు దక్కకపోయినా కనీసం…
