
ఆయకట్టు రైతుల న్యాయం చేయండి
సిరా న్యూస్,మిడుతూరు; మిడుతూరు మండలం, జలకనూరు గ్రామ మద్దిగుండం చెరువులోని సాగునీటిని విద్యుత్ మోటార్ల ద్వారా అక్రమంగా వాడుకోవడాన్ని అరికట్టాలని కోరుతూ జలకనూరు గ్రామ రైతులు డిఆర్ఓని కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం మైనర్ ఇరిగేషన్ అధికారులను కలిసి సమస్యను విన్నవించుకున్నారు.అనేక సంవత్సరాల నుండి జలకనూరు గ్రామంలో వర్షధారమైనటువంటి మద్దిగుండం చెరువు ద్వారా పంటలు సాగు చేసుకుని జీవిస్తున్నామని, ఈ సంవత్సరం జూన్ లో కురిసినటువంటి వర్షాల వల్ల చెరువు కు నీళ్లు రావడంతో వాటిపై ఆధారపడి మొక్కజొన్న, మిరప పంటలు సాగు చేసుకున్నామని, ప్రస్తుతం పంట చేతికి వచ్చే దశలో పంటలు ఉన్నాయని,ఈ దశలో ఉన్నటువంటి కొద్దిపాటి నీరును మా పక్క గ్రామాల్లోని రైతంగం 120 విద్యుత్ మోటార్లను పెట్టి ఉన్న నీటిని సుదూర ప్రాంతాలకు అక్రమంగా తోడి వేయడం వల్ల ఆయకట్టు దారులైన…
