ట్రేండింగ్ వార్తలు

స్వైర విహారం చేస్తున్న కుక్కలు

 సిరా న్యూస్,హైదరాబాద్; హైదరాబాద్ లో వీధికుక్కలు భయపెడుతున్నాయి. ఇంటి నుంచి బయట అడుగు పెట్టాలంటేనే భయమేసే పరిస్థితి వచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఎక్కడ చూసినా.. ఏ వీధిలో చూసినా గుంపులు.. గుంపులు వీధికుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. బయటకు వచ్చిన వెంటనే అవి మీద పడి కరిచేస్తున్నాయి. ఒంటరిగా మహిళలు, వృద్ధులు, పిల్లలు బయటకు రావడానికే జంకుతున్నారు. ఒకవేళ పొరపాటున వస్తే కుక్కల బారిన పడి గాయాలపాలవుతున్నారు. దీంతో హైదరాబాద్ లో కుక్కలను పారదోలండయ్యా బాబూ అంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులను ప్రజలు వేడుకుంటున్నారు. తమ వీధికి మున్సిపాలిటీ కుక్కల వ్యాన్ వచ్చి కొన్ని నెలలవుతుందని తెలిపారు. వీధి కుక్కల బారిన పడి తాజాగా బోరబండలో ఒక బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలుడి పరిస్థితి విషమంగా…

Read More
4 Nov 2024, 4:53 pmsiranews.in