
గూగుల్ సెర్చ్ లో డొక్కా సీతమ్మ…
సిరా న్యూస్,కాకినాడ; డొక్కా సీతమ్మ.. ప్రస్తుతం ఈ పేరు మార్మోగుతోంది. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టింది.దీంతో డొక్కా సీతమ్మ గురించి బలమైన చర్చ ప్రారంభమైంది.ఆమె ఎవరు? స్వాతంత్ర సమరయోధురాలా? దేశ నాయకురాలా? అంటూ అందరిలో అనుమానం ప్రారంభమైంది. ఆమె గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. ఎన్నికల ప్రచారంలో భాగంగా డొక్కా సీతమ్మ గురించి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆమె పేరిట క్యాంటీన్లను తెరుస్తామని ప్రకటించారు. అయినా సరే డొక్కా సీతమ్మ గురించి ఎక్కువమందికి తెలియదు. తాజాగా ప్రభుత్వం ఆమె పేరును గౌరవిస్తూ పథకానికి పెట్టిన వేళ.. ఆమె గురించి ఒకసారి సమగ్రంగా తెలుసుకుందాం. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో1841లో డొక్కా సీతమ్మ జన్మించారు. చిన్నతనంలోనే తల్లి నరసమ్మ చనిపోయారు.…
