
Don’t want MP… want MLA : ఎంపీ వద్దు… ఎమ్మెల్యేనే కావాలి
సిరా న్యూస్,విజయనగరం; ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టి ఆపై మంత్రి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆయన.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన ఆకాంక్షలను నీరుగారుస్తూ పార్లమెంటుకు వెళ్లాలని సూచిస్తున్నారు. సీఎం మాట కాదనలేక.. ఎన్నాళ్ళ నుంచో ఉన్న కోరికను తీర్చుకోలేక ఆ కీలక నేత తీవ్రంగా మదన పడుతున్నారు. ఆ నేతే విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను.విజయనగరం జిల్లా రాజకీయాలను కొన్నాళ్లుగా శాసిస్తూ వస్తున్న బొత్స సత్యనారాయణ మేనల్లుడుగా కొన్నాళ్లపాటు తెర వెనక రాజకీయాలు నడిపిన చిన్న శ్రీను గడిచిన ఎన్నికల్లోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. జడ్పిటిసి గా ఎన్నికైన ఆయనను సీఎం జగన్ మోహన్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా నియమించారు. ఇన్నాళ్లు తెరవెనక రాజకీయాలు నెరుపుతూ వచ్చిన శ్రీనివాసరావు తొలిసారి ప్రత్యక్ష రాజకీయాలు చేయడంతోపాటు అధికారికంగా అధికారాన్ని…
