Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 30 March 2024, 4:28 pmEditor : SIRA NEWS

Donta Sudhakar: ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మంత్రి పొన్నం ప్ర‌త్యేక దృష్టి

సిరాన్యూస్‌, సైదాపూర్
ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మంత్రి పొన్నం ప్ర‌త్యేక దృష్టి
* కాంగ్రెస్ సైదాపూర్ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్
* ప‌లు గ్రామాల‌ను సంద‌ర్శించిన నాయ‌కులు

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మంత్రి పొన్నం ప్ర‌త్యేక దృష్టి పెట్టార‌ని కాంగ్రెస్ సైదాపూర్ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్ అన్నారు. శ‌నివారం సైదాపూర్ మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు సైదాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్‌, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆసరి రఘు యాదవ్, గుండారపు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు గ్రామాలను సందర్శించారు. వె- సైదాపూర్, దుద్దెనపల్లి, ఎక్లాస్పూర్ ,  ఆరేపల్లి, వెన్నంపల్లి , లస్మన్న పల్లి, జాగిరిపల్లి , అగ్రరం, ఎలాబోతరం , గొడిశాల బొమ్మకల్ , రాయికల్ , ఘన్పూర్ ఆకునూర్ , పెర్కపల్లి గ్రామాల్లో ప‌ర్య‌టించారు. ఈసంద‌ర్భంగ వారు ఈ గ్రామాలలో నీటి సమస్యలను అడిగి తెలుసుకుంటూ,  అలాగే స్కూళ్లలో అవసరాలను తెలుసుకుంటూ పలు అభివృద్ధి పనులను చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. నీటి సమస్యల గురించి ఊర్లలో ఆరోగ్య సమస్యల గురించి ఏదైనా అవసరం కోసం ఎప్పుడైనా మంత్రిని సంప్రదించవచ్చని, ఒకవేళ మంత్రి సంప్రదించే పరిస్థితి లేనప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలతో ఈ విషయాన్ని తెలియజేయాలని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బైరి రాజు, రాజిరెడ్డి, రాజేందర్ రెడ్డి, రాఘవులు, రాజు,లక్ష్మారెడ్డి, రవీందర్ రెడ్డి, ప్రేమ్ కుమార్, పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.