డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో గులాబీ వాటం
మహబూబ్ నగర్; మహబూబ్ నగర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో పనిచేసిన ఓ అధికారి, తమ కార్యాలయ సిబ్బందితో కలిసి లక్షల్లో అవినీతికి పాల్పడ్డట్లు ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఏకంగా సీఎం కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టర్ వద్దకు అవినితీ భాగోతం తీసుకెళ్లడంతో రహస్య విచారణ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కోక్క ఇళ్లు అక్రమంగా కేటాయింపునకు సుమారు రూ.3 లక్షల నుంచి రూ.6లక్షలు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లు… ‘డబ్బుల్’ బెడ్ రూం ఇళ్లలా మారాయి. ఇళ్ల పంపిణీ అంశంలో నిర్ధిష్టమైన ప్రణాళిక అవలంబించకపోవడంతో అధికారుల అవినితీకి ఆసరాగా మారింది. నియోజకవర్గ పరిధిలో వివిధ ప్రాంతాల్లో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లలో ఒక్కో ప్రాంతానికి…
