Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 23 September 2024, 5:17 pmEditor : SIRA NEWS

Dr. Venugopalakrishna: డాక్ట‌ర్ వేణుగోపాలకృష్ణకు ఘన సన్మానం

సిరాన్యూస్‌,ఖానాపూర్ టౌన్
డాక్ట‌ర్ వేణుగోపాలకృష్ణకు ఘన సన్మానం

నిజామాబాద్ వైద్యకళాశాలలోవిధులు నిర్వ‌హిస్తున్న‌ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామానికి చెందిన డాక్టర్ వేణుగోపాలకృష్ణ ను సోమ‌వారం నిర్మ‌ల్‌ జిల్లా నాయకులు ఘనంగా సన్మానించారు .ఇటీవల డా.వేణు గోపాలకృష్ణ ప్రేమతో నాన్న చిత్రంతో ఉత్తమ కళాకారునిగా ,దర్శకునిగా నంది అవార్డులు అందుకున్నారు.ఆయన కూతురు సుహాసిని వైద్య విద్య చదువుతూ ,ఉత్తమ నటిగా ,భరతనాట్య కళాకారిణిగా పురస్కారాలు అందుకున్నారు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా డా.వేణుగోపాలకృష్ణ ని ప్రత్యేకంగా సన్మానించారు. కార్య‌క్ర‌మంలో నాయకులు ముత్యం రెడ్డి ,నర్సారెడ్డి ,చంద్రకాంత్వీ రేశం ,పుదరి రంజిత్ , సంతోష్, సాయి ,శ్రేయోభిలాషులు డా. రమేష్ రెడ్డి, డా. నీలిమ, రాజు ,అభి,వినోద్,కరుణాకర్, ఉదయ్ చంద్ర,అంజి, ప్రశాంత్ , డా.వేణు పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.