
Drill for new board : కొత్త బోర్డు కోసం కసరత్తు
సిరా న్యూస్,హైదరాబాద్; టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యుల నియామకంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఛైర్మన్ తో పాటు పూర్తిస్థాయిలో సభ్యులను నియమించాలని ముఖ్యమంత్రి (Cm)రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. బోర్డు నియామకంపై కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం... కొందరు బ్యూరోక్రాట్ల పేర్లతో పాటు ప్రొఫెసర్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. బోర్డును వీలయినంత త్వరగా నియామించాలని భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నియమించిన బోర్డు ఛైర్మన్‌తో పాటు ముగ్గురు సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త బోర్డు ఏర్పాటుపై దృష్టి సారించింది. నోటిఫికేషన్లు ఇవ్వాలన్నా, ఉద్యోగాలు భర్తీ చేయాలన్నా...పరీక్షలు నిర్వహించాలంటే బోర్డే కీలకం. అందుకే తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ బోర్డు నియామకంపై సీనియస్ గా కసరత్తు చేస్తోంది. గతంలో మాదిరిగా పొరపాట్లు జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత ప్రభుత్వ…
