
తాగుతున్నారు…. తిరుగుతున్నారు…
సిరా న్యూస్,హైదరాబాద్; మూడు కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నా కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనదారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావటం లేదు. ఏకంగా 3,000 మంది మద్యం సేవించి వాహనం నడుపుతూ రెండోసారి పోలీసులకు పట్టబడ్డారు. గడిచిన రెండు సంవత్సరాల వ్యవధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాహనదారుల గణాంకాలను ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. సుమారు 3000 మంది రెండవసారి మద్యం తాగి వాహనం నడిపి పోలీసులకు పట్టుబడ్డారు.వీరిలో తరచుగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారిని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. 2023 జనవరి నుండి ఇప్పటివరకు 1587 మంది మద్యం సేవించి వాహనం నడిపిన వారిని పోలీసులు పట్టుకున్నారు. వీరంతా రెండవసారి మద్యం సేవించి ఏదేచ్ఛగా వాహనం నడుపుతూ పోలీసులు తనిఖీల్లో…
