తాజా వార్తలు

గ్రేటర్ వరంగల్ కు త్రాగు నీటి కష్టాలు

సిరా న్యూస్,వరంగల్; గ్రేటర్ వరంగల్ నగరానికి తాగునీటి తిప్పలు తప్పేలా లేవు! ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటుతుండటం కలవరపెడుతుండగా.. దేవాదుల పంపింగ్ నిలిచిపోవడం సమస్యగా మారింది. ఫలితంగా వరంగల్ ట్రై సిటీకి ప్రధాన తాగునీటి వనరు అయిన ధర్మసాగర్ రిజర్వాయర్ నీటిమట్టం పడిపోతోంది. అందుకే నగర ప్రజలకు రోజువారీగా సప్లై చేయాల్సిన నీటిని రెండు, మూడు రోజులకోసారి విడుదల చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండగా.. నీటిని పొదుపుగా వాడుకోకపోతే బెంగళూరు దుస్థితి తలెత్తే ప్రమాదం లేకపోలేదు. వరంగల్ ట్రై సిటీకి ధర్మసాగర్ రిజర్వాయర్ తో పాటు కరీంనగర్ ఎల్ఎండీ నుంచి నీటిని సరఫరా చేస్తుంటారు. లోయర్ మానేర్ డ్యాం నుంచి ప్రతి రోజు 60 ఎంఎల్డీ(మిలియన్ లీటర్ పర్ డే) తీసుకుంటున్న అధికారులు ధర్మసాగర్ లోని ప్లాంట్ వద్ద…

Read More
27 Apr 2024, 1:23 pmsiranews.in