
DSP Jeevan Reddy: మూడు వ్యభిచార గృహాల పై దాడి : ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి
సిరాన్యూస్, ఆదిలాబాద్ మూడు వ్యభిచార గృహాల పై దాడి : ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి నిర్వాహకులు, విటులపై కేసులు నమోదు * సీసీఎస్, ఆదిలాబాద్ పట్టణ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ * బాధిత మహిళలకు పునరావాస ఏర్పాటుకు కృషి ఆదిలాబాద్ పట్టణంలో బుధవారం రాత్రి జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ సీసీఎస్ పోలీసులు, పట్టణ పోలీసులు సంయుక్తంగా పట్టణంలోని పలు వ్యభిచార గృహాలపై దాడిని నిర్వహించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణం మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ, టీచర్స్ కాలనీలో, అలాగే ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యానగర్‌లో…
