
మైసూరుకు దసరా శోభ
సిరా న్యూస్,బెంగళూరు; ఈసారి దసరాకు మైసూరు వెళ్లారా..? లైఫ్‌టైమ్‌లో ఒక్కసారైనా దసరా పండగను మైసూర్లో చూడాల్సిందే. మైసూరుకెళ్లి దసరాను సెలబ్రేట్ చేసుకున్న ప్రతీవాళ్లూ చెప్పే మాటే ఇది. ఎందుకంటే మైసూర్ అంటే దసరా.. దసరా అంటేనే మైసూరు.. మైసూరులో జరిగే శరన్నవరాత్రులు.. చూడ్డానికి రెండు కళ్లూ సరిపోనంత గొప్ప సంబరం అది. 400 ఏళ్లకు పైగా చరిత్రున్న మహా వేడుక అది..పదిమంది కూడితే పండగ. వందలు-వేలమంది కలగలిస్తే అది ఉత్సవం. మరి.. లక్షల మంది ఒక్కచోట చేరి సంబరమాడితే.. అది మహోత్సవం. దేశమంతటా దేవీ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అవన్నీ ఒక ఎత్తయితే.. మైసూరులో జరిగే దసరా ఉత్సవం.. రాయల్ ఫెస్టివల్ ఒక్కటీ ఒక ఎత్తు..జోష్ అన్‌లిమిటెడ్.. జాయ్ అన్‌లిమిటెడ్.. సెలబ్రేషన్ అన్‌లిమిటెడ్.. మస్తీ అన్‌లిమిటెడ్. ట్రెడిషనల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి పర్‌ఫెక్ట్ కేరాఫ్ ఏదంటే ఇంకేంటి మైసూరు…
