తాజా వార్తలు

దువ్వాడ షాకింగ్ డెసిషన్

 సిరా న్యూస్,శ్రీకాకుళం; ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఎపిసోడ్లో కీలక ట్విస్ట్. ఎమ్మెల్సీ దువ్వాడ, ఆయన సన్నిహితురాలు మాధురి, భార్య దువ్వాడ వాణి మధ్య సాగుతున్న ట్రయాంగిల్ స్టోరీ మరో మలుపు తిరిగింది. మాధురితో తాను నివాసం ఉంటున్న ఇంటి విషయంలో భార్య దువ్వాడ వాణి, పిల్లల నుంచి ఎదురవుతున్న అభ్యంతరాల నేపథ్యంలో శ్రీనివాస్ నోరు విప్పారు. ఆ ఇంటి విషయంలో ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేశారు. మీడియా సమక్షంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు సన్నిహితురాలు మాధురి ఫోన్ చేశారు. ఫోన్లోనే ఆమెకు ఇంటిపై దువ్వాడ క్లారిటీ ఇచ్చారు. మాధురికి తాను రెండు కోట్లు అప్పుగా ఉన్నానని.. ఇంటి నిర్మాణంతోపాటు రాజకీయ అవసరాల కోసం ఆ డబ్బు వాడుకున్నట్లు చెప్పుకొచ్చారు. చింతాడ పార్వతీశం అనే వ్యక్తికి సైతం60 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉందని వెల్లడించారు.…

Read More
10 Sep 2024, 10:44 amsiranews.in