
Early Sankranti celebrations at Gayatri Vidyanikethan: గాయత్రి విద్యానికేతన్ లో ముందస్తు సంక్రాంతి సంబరాలు
సిరా న్యూస్,పెద్దపల్లి; పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ లో విద్యార్థినులకు ముందస్తు సంక్రాంతి వేడుకలలో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు వివిధ రకాల ఆకృతులలో వేసిన రంగవల్లులు అందరినీ ఆకర్షించాయి. ముఖ్యంగా చిన్నారులు వేసిన ముగ్గులు, ఒక అమ్మాయి, బంధాలను గూర్చి తెలిపే సందేశాత్మక ముగ్గు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రకరకాల బొమ్మలతో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువుని పిల్లలు ఆసక్తిగా వీక్షించారు. అనంతరం బాలురకు గాలిపటాల పోటీ నిర్వహించగా, అందరూ ఆనందంతో కేరింతలు కొడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు విద్యార్థులు హరిదాసు వేషధారణలో రావడం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం భోగి మంటలు వేసి, వాటి చుట్టూ పిల్లలు, టీచర్లు అందరూ చేరి ఆనందంతో నృత్యం చేశారు. గాయత్రి విద్యా నికేతన్ కరస్పాండెంట్ రజనీ దేవి కూడా వారితో పాటు నృత్యం చేస్తూ వారిని…
