తాజా వార్తలు

మార్చురీ అంబులెన్స్ వాహనాన్ని వితరణ చేసిన ఎడిఫై స్కూల్ అధినేత ప్రణీత్

సిరా న్యూస్,తిరుపతి; ఎడిఫై స్కూల్స్ కార్పొరేట్ సోషియల్ రెస్పాన్సిబిలిటీ క్రింద జనతా సోసైటీ వారికి మార్చురీ అంబులెన్స్ వాహనాన్ని వితరణగా ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని ఎడిఫై స్కూల్ అధినేత ప్రణీత్ హర్షం వ్యక్తం చేశారు. తిరుచానూరులో గల ఎడిఫై స్కూల్ వారు జనతా సొసైటీ అనే స్వచ్ఛంద సేవా సంస్థకు మార్చురీ అంబులెన్స్ వాహనాన్ని వితరణగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎడిఫై స్కూల్ అధినేత ప్రణీత్ మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోయిన పేదవారి శవాలను వారి సొంత గ్రామానికి తరలించడానికి అంబులెన్స్ వారు అధిక ధరలు వసూలు చేశారని గుర్తు చేశారు. చాలామంది పేదవారు డబ్బులు లేక బాధపడటం చూసి సమాజానికి నా వంతుగా మేలు చేయాలని తలంపుతో మార్చురీ అంబులెన్స్ వాహనాన్ని జనతా సొసైటీ వారికి వితరణగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. రానున్న…

Read More
7 Mar 2024, 6:02 pmsiranews.in