
అంతు లేని కథలు
సిరా న్యూస్,విజయవాడ; ఇటీవలి కాలంలో కుటుంబ వివాదాలు వీధికెక్కుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఓవైపు ఇల్లీగల్ కాంటాక్ట్స్.. మరోవైపు ఆస్థి తగాదాలు దుమారాన్ని రేపుతున్నాయి. రాజకీయ సినీ ప్రముఖులు ఈ వివాదాల్లో ఉండటం గమనార్హం. దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణిల కుటుంబ పంచాయతీ పది రోజులుగా పరిష్కారం కాకుండా వివాదాల్లో నలుగుతూనే ఉంది. టెక్కలిలో నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి బలవంతంగా వచ్చి ఆందోళన చేసిన వాణిపై దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుఫై 41 నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే, నోటీసులు తీసుకోడానికి దువ్వాడ వాణి నిరాకరించారు. ముందు శ్రీనివాస్‌కు నోటీసులు ఇచ్చిన తర్వాతే తనకు ఇవ్వాలని వాణి సూచించారు.తనపై దాడి చేశారంటూ దువ్వాడ వాణి ఇచ్చిన ఫిర్యాదుతో దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు నమోదు అయింది. ఐదు రోజుల క్రితం దువ్వాడ వాణి తరఫున పెద్ద…
