తాజా వార్తలు

Eshwari Bai Visited Addagutta: వైద్య శిభిరాన్ని పరిశీలించిన రాష్ట్ర మహిళ కమిషన్‌ సభ్యులు

సిరా న్యూస్, ఆదిలాబాద్‌: వైద్య శిభిరాన్ని పరిశీలించిన రాష్ట్ర మహిళ కమిషన్‌ సభ్యులు ఆదిలాబాద్‌ జిల్లా రూరల్‌ మండలంలోని అడ్డగుట్ట గ్రామంలోని అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీఎం జన్‌మన్‌ వైద్య శిభిరాన్ని రాష్ట్ర మహిళ కమిషన్‌ సభ్యులు ఈశ్వరీ బాయి పరిశీలించారు. గురువారం గ్రామానికి వెళ్లిన ఆమె, గ్రామంలో నిర్వహిస్తున్న వైద్య పరీక్షలు, చికిత్సల గురించి అడిగి తెల్సుకున్నారు. సికెల్‌ సెల్‌ పరీక్షలతో పాటు, ఇతరాత్ర పరీక్షలు చేపడుతున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. నిరుపేదలైన ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలని, వైద్య శిభిరాలను పకడ్బందీగా నిర్వహించాలని ఆమె కోరారు. ఆమె వెంట మెడికల్‌ ఆఫీసర్‌ సర్ఫరాజ్, రామాయి సబ్‌సెంటర్‌ హెల్త్‌ అసిస్టెంట్‌లు లలిత, మమత, అశా కార్యకర్తలు ఉన్నారు.

Read More
25 Jan 2024, 11:21 pm
Updated: 25 Jan 2024, 11:22 pm
siranews.in