తాజా వార్తలు

నిధులున్నా…. కనిపించని అభివృద్ధి…

 సిరా న్యూస్,హైదరాబాద్; నగర శివారు మున్సిపల్కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఫండ్స్ఫుల్ గాఉన్నప్పటికీ డెవలప్ మెంట్మాత్రం జరగడంలేదు. కొన్ని మున్సిపాలిటీల్లో కనీస మౌలిక సౌకర్యాలు కూడా లేకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉన్న గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో వీలినం అయినప్పటికీ.. నాటితో పోలిస్తే ప్రస్తుత పరిస్థితులు అధ్వానంగా మారాయి. గతంలో సమస్యలుంటే స్థానికంగా ఉండే సర్పంచ్ ని అడిగితే ఎంతో కొంత పనులు జరిగేవి. ఇప్పుడు మేయర్లు, చైర్మెన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను అడగలేని పరిస్థితి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ చాలా ప్రాంతాల్లో నేటికీ నల్లా కనెక్షన్లు లేవు. వర్షాలు కురిసిన సమయంలో ఇబ్బందులు పడే ప్రాంతాల్లోనూ కనీస చర్యలు తీసుకోలేదని, చెరువుల అభివృద్ధిని పట్టించుకోవడంలేదని పాలకులపై ప్రజలు మండిపడుతున్నారు. చెత్త నిర్వహణ లేకపోవడంతో…

Read More
25 Jan 2024, 4:22 pmsiranews.in