
అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభానికి అంతా సిద్ధం
సిరా న్యూస్,విజయవాడ; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంబేడ్కర్ స్మృతి వనం పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో విజయవాడ నగరం నడిబొడ్డున చేపట్టిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతివనం పనులు తుది దశకు చేరుకున్నాయి. దాదాపు ఏడాది క్రితమే పనులు పూర్తి కావాల్సి ఉన్నా రకరకాల కారణాలతో పనుల్లో జాప్యం జరిగింది.దేశంలోనే అత్యంత ఖరీదైన అంబేడ్కర్ స్మృతి వనాన్ని ఏపీ ప్రభుత్వం విజయవాడలో ఏర్పాటు చేస్తోంది. అంచనాలకు రెట్టింపు ఖర్చుతో ప్రాజెక్టును పూర్తి చేశారు. రెండేళ్ల క్రితమే అంబేడ్కర్ స్మృతి వనం పనులు పూర్తివ కావాల్సి ఉన్నా కోవిడ్ ఆంక్షలు, నిధుల విడుదలలో జాప్యం, ఆకృతులు ఖరారు కాకపోవడం వంటి కారణాలతో తీవ్ర జాప్యం జరిగింది.గత ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో 125అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించే సమయానికి విజయవాడ విగ్రహం పనులు ప్రారంభదశలోనే…
