
ఆంధ్ర రాములోరి కల్యాణానికి అంతా రెడీ
సిరా న్యూస్,కడప; ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు విస్తృతంగా చేస్తున్నట్లు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. ఏప్రిల్ 17 నుంచి 25 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 22న సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు.ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 17 నుంచి 25వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ సిద్ధార్థ్ కౌశిల్ జిల్లా యంత్రాంగంతో సోమవారం ఒంటిమిట్టలో జేఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈవో వీరబ్రహ్మం మాట్లాడుతూ.. టీటీడీలోని అన్ని విభాగాలు, జిల్లా యంత్రాంగం, పోలీసులు సమష్టి కృషి చేసి ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.…
