
రుషికొండను పరిశీలిస్తున్న కేంద్రబృందం
సిరా న్యూస్,విశాఖపట్టణం; ఆంధ్రప్రదేశ్ విశాఖలోని రుషికొండ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన జగన్ సర్కార్... రుషికొండపై సీఎం క్యాంపు కార్యాలయంతోపాటు కొన్ని భవనాలు నిర్మిస్తోంది. అయితే.. కొండపై జరుగుతున్న నిర్మాణాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. హైకోర్ట్‌లో కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు రుషికొండపై అక్రమ తవ్వకాలు, నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘనల తీవ్రతను తేల్చేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నియమించిన నిపుణుల కమిటీ విశాఖ చేరుకుని... రుషికొండపై నిర్మిస్తున్న భవనాలను పరిశీలించింది. రుషికొండకు చేరుకున్న కేంద్ర కమిటీ బృందం సభ్యులను.. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) అధికారులు రిసీవ్ చేసుకున్నారు. అధికారులు స్వాగతం పలికారు. కె.గౌరప్పన్ నేతృత్వంలో నేషనల్…
