
Excise SI Vinod Kumar: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఎక్సైజ్ ఎస్సై వినోద్ కుమార్
సిరాన్యూస్, సైదాపూర్: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఎక్సైజ్ ఎస్సై వినోద్ కుమార్ * డ్రగ్ రహిత తెలంగాణ మన లక్ష్యం కావాలి విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హుజురాబాద్ ఎక్సైజ్ ఎస్సై వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం సైదాపూర్ మండలంలోని ఎక్లాస్ పూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్ రహిత తెలంగాణ నినాదంతో మాదకద్రవ్యాలు, చెడు అలవాట్లు వాటి దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా ఎక్సైజ్ ఎస్సై వినోద్ కుమార్. మాట్లాడుతూ గ్రామాల్లో యువత చెడువైపు వేగవంతంగా మాదక ద్రవ్యాల వైపు ఆకర్షితులై తమ జీవితాల్ని కోల్పోతున్నారని, కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని, తాత్కాలిక ఆనందం క్షణికమైన ఒత్తిడి నుండి తట్టుకోవడానికి డ్రగ్స్ ను ఆసరా చేసుకుంటున్నారని అది చాలా బాధాకరమని, విచారం వ్యక్తం చేశారు. గంజాయి, కల్తీకల్లు, గుట్కా, అంబర్ లాంటి పాన్…
