తాజా వార్తలు

ఎల్ ఆర్ ఎస్ కోసం కసరత్తు…

సిరా న్యూస్,హైదరాబాద్; ఎల్ఆర్‌ఎస్‌ (లే అవుట్ల క్రమబద్ధీకరణ) దరఖాస్తులను పరిష్కరించటంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. మూడు నెలల్లోనే ఈ దరఖాస్తులను క్లియర్ చేయాలనే ఉద్దేశ్యంతో సర్కార్ ఉంది. ఇదే విషయంపై అధికారులకు ఆదేశాలు కూడా అందాయి. సాధ్యమైనంత త్వరగా దరఖాస్తులను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 75 శాతం దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు లేనట్లు తేలటంతో… ఇటీవలే దరఖాస్తుదారులకు మరో అవకాశం కూడా కల్పించింది. కావాల్సిన పత్రాలను ఆన్ లైన్ లోనే సమర్పించేలా.. సవరణకు ఛాన్స్ ఇచ్చింది. వెబ్ సైట్ లో సిటిజన్ లాగిన్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.2020లో ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను తీసుకొచ్చారు. ఇందుకోసం గ్రామాలు, పట్టణాల్లో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ స్కీమ్ లో భాగంగా…అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. ఈ ప్రక్రియపై తీవ్రస్థాయిలో విమర్శలు రాగా……

Read More
22 Aug 2024, 5:31 pmsiranews.in