
వివాహేతర బంధం…
భార్య ప్రియుడి హత్య, అరెస్ట్... సిరా న్యూస్,అదిలాబాద్; వివాహ బంధానికి విలువ ఇవ్వడం మానేశారు చాలా మంది. శారీరక వాంఛల కోసం... వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడిచిన వారు ఉండగానే... మరొకరితో సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో కక్షలు పెరుగుతున్నాయి. హత్యలకు దారి తీస్తున్నాయి. ఇలా... ఇల్లీగన్ అఫైర్స్‌తో... ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. భార్య, ప్రియుడు కలిసి భర్తను చంపేసిన సంఘటనలు కొన్ని అయితే.... భార్యతో సన్నిహితంగా ఉంటున్న వ్యక్తిని భర్త చంపేసిన సంఘటనలు ఇంకొన్ని. ఇలా... తరచూ ఇలాంటి వార్తలు వింటూనే విన్నాం. మంచిర్యాల జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది.మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కమ్మర్‌పల్లి శివారులోని అటవీ ప్రాంతంలో రాత్రి జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు. భార్యతో వివాహేతర…
