
పుంగునూరుకు దూరంగా పెద్దిరెడ్డి…
సిరా న్యూస్,తిరుపతి; చిత్తూరు జిల్లా పాలిటిక్స్ లో పెద్దాయనగా పుంగనూరులో పెద్దిరెడ్డికి ఇంపార్టెన్స్ ఉన్నా.. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో అక్కడ సీన్ రివర్స్ అయ్యింది. పెద్దిరెడ్డి ఫ్యామిలీకి తిరుగులేని పుంగనూరులో ఇప్పుడు పర్యటించాలంటేనే పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. పెద్దిరెడ్డితో పాటు, తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇలా ముగ్గురూ ఫ్యామిలీ మెంబెర్స్ గెలిచినా ఆ ఫ్యామిలీకి ఇప్పుడు అక్కడ చుక్కెదురవుతోంది.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పుంగనూరులో పెద్దిరెడ్డి ఫ్యామిలీ పర్యటించాలంటే భారీ పోలీసు బందుబస్తు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పుంగనూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యుడుగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉన్నా ఆ నియోజకవర్గంలో వారి పర్యటన సాఫీగా సాగని పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గాల పునర్విభజన అంశం పుంగనూరు పాలిటిక్స్ లో కొత్త అంశాన్ని తెరమీదికి…
