తాజా వార్తలు

అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో భయం..భయం…

సిరా న్యూస్,హైదరాబాద్; పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ చార్జులుగా ఉన్న కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు సీరియస్‌గా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఒకవేళ అనుకున్న ఫలితాలు రాకపోతే అధిష్టానం నుంచి చివాట్లు తప్పవనే ఆందోళన వారిలో కనిపిస్తున్నది. రెండురోజుల క్రితం కేసీ వేణుగోపాల్ ఎన్నికల ప్రచారం తీరుపై మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడంతో, సదరు లీడర్లలో కదలిక వచ్చినట్టు తెలుస్తున్నది. ఈనెల 10,11 తేదీల్లో ఏఐసీసీ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రానున్నారు. దీంతో వారు పాల్గొనే సభలు, రోడ్డుషోల విజయవంతానికి ప్రత్యేక దృష్టిపెట్టారు.లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపోటములు మంత్రులు, ఎమ్మెల్యేలకు చాలెంజ్‌గా మారాయి. ఇన్ చార్జులుగా ఉన్న స్థానాల్లో అభ్యర్థులు గెలిస్తే పదవులు దక్కుతాయని, ఓడితే ఉన్న పదవులు ఊడుతాయనే సంకేతాలను…

Read More
9 May 2024, 11:57 amsiranews.in