
టీడీపీ అభ్యర్ధుల్లో భయం
సిరా న్యూస్, విజయవాడ; ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీలు వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార వైసిపి దూకుడు మీద ఉంది. ఇప్పటివరకు 53 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చింది. మరో 30 మందిని మార్చేందుకు కసరత్తు చేస్తోంది. అటు ఎంపీ అభ్యర్థుల మార్పు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు మూడు జాబితాలు విడుదలయ్యాయి. మలి విడత జాబితా రానున్నట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి. అయితే వైసిపి వేగంగా అడుగులు వేస్తుండగా.. తెలుగుదేశం పార్టీ నుంచి ఆ స్థాయిలో ప్రకటన రావడం లేదు. అభ్యర్థులు ఖరారు కావడం లేదు. జనసేనతో పొత్తులో ఉండడం ఒక కారణమైతే.. బిజెపి కలిసి వస్తుందని ఎదురుచూపు మరో కారణం.తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తుంది? ఇస్తే ఎక్కడిస్తుంది? జనసేన ఎన్ని స్థానాలు అడుగుతుంది? ఆ పార్టీకి బలమైన నియోజకవర్గాలు ఎన్ని? పొత్తులో…
