
మార్కెట్లను ముంచెత్తుతున్న మాంద్యం భయం
సిరా న్యూస్; దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగస్తున్నాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచే భారీ నష్టాలతో మొదలైంది. 2400 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ 2600 పాయింట్ల వరకు నష్టాలను చూసింది.ఇక నిఫ్టీ సైతం ట్రేడింగ్ ప్రారంభం నుంచే నష్టాలు చూసింది. చివర్లో కోలుకుని 24,000కి పైన ముగిసినప్పటికీ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 729 పాయింట్ల నష్టంలో 23,983 వద్ద ట్రేడ్ అయింది.గత వారం 25 వేల మార్కును తాకి రికార్డు సృష్టించిన నిఫ్టీ వారం చివర్లో మాత్రం అమ్మకాల తాకిడిని ఎదుర్కొంది.ప్రస్తుతం అంతర్జాతీయంగా వస్తోన్న ప్రతికూల సంకేతాలతో దేశీయ మార్కెట్లూ నష్టాలు చవిచూశాయి. అమెరికా విడుదల చేసిన జులై నెల జాబ్స్ డేటాలో అంచనాల కంటే ఉద్యోగాల కల్పన తగ్గిపోయినట్లు తేలింది.నిరుద్యోగ రేటు మూడేళ్ల గరిష్ఠానికి చేరింది. దీంతో ఆ దేశంలో…
