
అడ్డదారిలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ
సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణలో మళ్ళీ అడ్డదారిలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ నిరుద్యోగ రక్షణ జెఏసి ఛైర్మన్ డా. మహిపాల్ యాదవ్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో డా.మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ.... గత ప్రభుత్వంలో అడ్డదారుల్లో బ్యాక్ లాగ్ ఉద్యోగాలు భర్తీ చేసి అనేక తప్పిదాలు చేశారని, ఆ బాటలోనే ఈ ప్రభుత్వంలో ఉన్న కొంత మంది అధికారులు వారం రోజుల్లో మళ్లీ అడ్డదారుల్లో గుట్టుచప్పుడు కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని మున్సిపల్ ఇరిగేషన్ రెవెన్యూ తదితర శాఖలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి సిద్దపడుతున్నట్టు డా. మహిపాల్ యాదవ్ ఆరోపించారు.గతంలో అడ్డదారీలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల ద్వారా నియమించబడ్డ వాళ్లని తొలగించాలని,అలా అక్రమంగా నియమించిన వాళ్లను కఠినంగా శిక్షించాలన్నారు.అర్హులైన వారిని మాత్రమే…
