
డీఎస్సీలో 1:3 నిష్పత్తిలో ఫైనల్ సెలక్షన్
సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణ రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించిన ఆన్లైన్ పరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. కీ పై అభ్యంతరాల స్వీకరణకు గడువు ఆగస్టు 20వ తేదీగా నిర్ణయించింది. జులై 18న ప్రారంభమై డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలు ఆగస్టు 5 తేదీతో ముగిశాయి. డీఎస్సీకి మొత్తం 2,79,957 మంది దరఖాస్తులు చేసుకోగా.. వారిలో 2,45,263 మంది అంటే 87.61 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. దాదాపు 34,694 మంది పరీక్షలకు దూరంగా ఉన్నారు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులకు 92.10 శాతం హాజరు నమోదైంది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్ ఆన్సర్ కీ తయారు చేసి, ఫలితాలను వెల్లడించేందుకు విద్యాశాఖ కార్యచరణ రూపొందించింది. ఈ మేరకు ఉపాధ్యాయ నియామక ప్రక్రియను సెప్టెంబర్ ఆఖరి వారం నుంచి మొదలు…
